భారత్ భారీ ఒప్పందం కొరియాతో

- April 18, 2017 , by Maagulf
భారత్ భారీ ఒప్పందం కొరియాతో

సముద్రాల్లో గనులను ధ్వంసం చేయడానికి లేదా గుర్తించడానికి ఉపయోగపడే 12 పెద్ద ఓడల నిర్మాణానికి భారత నావికా దళం దక్షిణ కొరియా రక్షణ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.35 వేల కోట్లు వ్యయం కానుంది. ఈమేరకు గోవా షిప్‌యార్డ్, దక్షిణ కొరియా సంస్థకు మధ్య నెలకొన్న సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని, ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని నేవీ యుద్ధ నౌకల ఉత్పత్తి, సేకరణ కంట్రోలర్‌ వైస్‌ అడ్మిరల్‌ డీఎం దేశ్‌పాండే తెలిపారు.
ల్యాండింగ్‌ ప్లాట్‌ఫాం డాక్‌(ఎల్‌పీడీ)ల కొనుగోలుకు ఒప్పందాన్ని కూడా ఈ ఏడాది చివరి నాటికి ఖరారు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో ఆయన ఈ విషయాలు తెలిపారు. 20 వేల టన్నుల బరువున్న 4 ఎల్‌పీడీలను కొనుగోలు చేయాలని నేవీ యోచిస్తోంది.
స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ రెండో దశ ప్రాజెక్టు(ఐఏసీ–2)కు నిధుల విడుదల కోసం రాబోయే 3–4 నెలల్లో రక్షణ శాఖను సంప్రదిస్తామని దేశ్‌పాండే చెప్పారు. 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కూడా నావికా దళం యోచిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న 6 స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాములకు అదనంగా మరిన్ని జలాంతర్గాముల అవసరం నేవీకి ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com