టాలీవుడ్ పై నటుడు అజయ్ ఘోష్ విమర్శల వర్షం
- April 18, 2017
ఒకరిని పొగడడం కోసం మరొకరిని తెగడడం తెలుగు వారి అలవాటు అనిపిస్తుంది.. నటుడు అజయ్ ఘోష్ చేసిన కామెంట్స్ వింటే.. తాజాగా నటుడు అజయ్ ఘోష్ సినిమాల్లో నటించడం బోర్ కొట్టినటుందేమో.. నిజజీవితంలో నటించడం మొదలు పెట్టాడు.. తమిళ చలన చిత్ర పరిశ్రమను పొగడడానికి, తమిళ వారిని ఆకాశానికి ఎత్తేస్తూ.. తనకు అవకాశాలు ఇచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమని.. తెలుగు వారిని చులకన చేసి మాట్లాడాడు.. ఆస్కార్ కోసం సెలక్ట్ అయిన విసరనై సినిమాలో నేను నటించానని నా మాతృ సంస్థ అయిన తెలుగు చిత్ర పరిశ్రమ తనను గుర్తించలేదని.. కానీ తమిళ వారు గుర్తించి ఆదరించారని.. ఆ సినిమాలో నటించినందుకు నాకు ఫోన్లు చేసి కోలీవుడ్ మీడియా ఇంటర్యూలు అడిగారు అంటూ తమిళ మీడియాను ఆకాశానికి ఎత్తేశాడు.. చెన్నయ్ లో రెండు రోజుల క్రితం జరిగిన ''తప్పు తాండా'' సినిమా ఆడియో లాంచ్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. తాను చెన్నై లో అడుగు పెట్టగానే ముందుగా నెల తల్లికి మొక్కుతానని మొదలు పెట్టిన అజయ్ ఘోష్ తన అద్భుతమైన నటనతో.. అనేక హావభావాలను వ్యక్త పరుస్తూ.. మైక్ ముందు తెగ లెక్చర్ ఇచ్చేశాడు.. తనకు తమిళ పరిశ్రమ కొత్త జన్మ ఇచ్చింది... తమిళ పీపుల్ గ్రేట్ అంతే. ఇక్కడ మీకు బిల్డప్ లు లేవు. తమిళ జనాలకు సోషల్ అండ్ పొలిటికల్ అవగాహన చాలా ఎక్కువ. వెట్రిమారన్ తో 28 రోజులు పనిచేశాను.. ఆ వర్క్ చాలా గ్రేట్ అంతే. శిరస్సు వంచి తమిళ ఇండస్ర్టీ వారికి పాదాభివందనం చేస్తున్నా'' అన్నాడు. అంతేకాదు చెన్నయ్ లో ఖాళీగా ఉన్న ఆటోవాళ్ళు పేపర్ చదువుతుంటారు. అదే మా దగ్గర అయితే పాన్ తింటూ ఉంటారు. అలాగే అక్కడి సాంబార్ తింటే మోషన్స్ అవుతాయి. ఇక్కడ తింటే వావ్' అంటూ కామెంట్స్ చేశాడు.. తెలుగు మీడియాపై అనేక సెటైర్స్ వేశాడు.. మరి అజయ్ తెలుగు పరిశ్రమ గురించి తక్కువగా మాట్లాడడంతో విన్న వారికి కోపం తెప్పిస్తుంది..
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







