శృంగారం, అనంతరం దొంగతనం!

- April 19, 2017 , by Maagulf
శృంగారం, అనంతరం దొంగతనం!

ఫ్లైట్‌ అటెండెంట్‌ మేనేజర్‌ ఒకరు, ఇద్దరు వ్యక్తులతో శృంగారం అనంతరం దోపిడీకి గురయ్యాడు. పాకిస్తానీ కార్మికులు ఇద్దరు, తనతో సెక్స్‌లో పాల్గొని, అనంతరం దొంగతనానికి పాల్పడినట్లు 58 ఏళ్ళ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో ఒకరు బాధితుడితో తరచూ శృంగారంలో పాల్గొనేవాడు. అయితే డిసెంబర్‌ 24న ఆన్‌లైన్‌ ద్వారా మెసేజ్‌ పంపి, తనతోపాటు ఇంకో వ్యక్తిని బాధితుడి దగ్గరకు తీసుకొచ్చాడు మరో నిందితుడు. అందరూ శృంగారంలో పాల్గొన్న అనంతరం దోపిడీకి పాల్పడ్డారు. ల్యాప్‌టాప్‌, ఐ పాడ్‌, బ్యాంక్‌ కార్డ్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వ్యక్తిగత కార్డ్స్‌నీ, లెదర్‌ బ్యాగ్‌నీ దొంగిలించారు నిందితులు. నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడు, బాధితుడి దగ్గరకు వెల్ళిన ప్రతిసారీ 150 దిర్హామ్‌లు శృంగారం కోసం తీసుకునేవాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com