సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- February 25, 2026
కువైట్: కువైట్‌లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై పర్యావరణ ప్రజా అథారిటీ (EPA) ఆంక్షలు విధించింది. బీచ్‌లో పక్షులను ఫోటో తీయడానికి డ్రోన్లను ఉపయోగించడంపై హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా వీడియోలు వైరల్ కావడంపై అథారిటీ స్పందించింది. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి సైకిల్స్ మరియు సహజ ప్రవర్తనకు ఇబ్బంది కలుగుతుందని అథారిటీ తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ (100)ను ఉటంకిస్తూ.. వన్యప్రాణులు, వాటి గూళ్ళు, గుడ్లు లేదా ఆవాసాలకు హాని కలిగించడం నిషేధించబడిందని అథారిటీ గుర్తు చేసింది. చట్టాలు, నిబంధనలను పాటించాలని సూచనలు ఇస్తూనే.. ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







