దుబాయ్‌ పోలీస్‌ చేతికి బీచ్‌ బగ్గీస్‌

- April 20, 2017 , by Maagulf
దుబాయ్‌ పోలీస్‌ చేతికి బీచ్‌ బగ్గీస్‌

దుబాయ్‌: బీచ్‌లలో ఇకపై బీచ్‌ బగ్గీస్‌ కనిపిస్తాయి. దుబాయ్‌ పోలీసులు తమ పెట్రోల్‌ ఫ్లీట్‌లోకి బీచ్‌ బగ్గీస్‌ని తీసుకొచ్చారు. టజూూరిస్ట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, తమ తొలి క్వాడ్‌ బైక్‌ పెట్రోల్‌ యూనిట్‌ని ప్రకటించింది. ఈ వాహనాన్ని తెలుపు రంగులో, ఫారెస్ట్‌ గ్రీన్‌ కాంబినేషన్‌లో రూపొందించారు. టూరిస్ట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ ముబారక్‌ సయీద్‌ సలీమ్‌ బిన్‌ నవ్వాస్‌ మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు, బీచ్‌లో టూరిస్టుల భద్రత కోసం వీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త పోలీస్‌ పెట్రోల్స్‌ టూరిస్టులకు సంబంధించిన వస్తువులకు కూడా భద్రతనిస్తాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి తమ వస్తువుల్ని తరలించడానికి వీటిని ఉపయోగించవచ్చు. బీచ్‌ పెట్రోల్స్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌, రెండు అదనపు కుర్చీలు, టూరిస్టుల లగేజ్‌ని తరలించేందుకు తగినంత పేస్‌ ఉంటాయని లెఫ్టినెంట్‌ కల్నల్‌ బిన్‌ నవ్వాస్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com