ఇంధన ట్యాంకర్ ను ' ఢీ ' కొట్టిన కారు మంటలలో సజీవ దహనమైన టాక్సీ డ్రైవర్
- April 21, 2017
స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 33 టన్నుల పెట్రోలియంను తీసుకెళుతున్నఇంధన ట్యాంకర్ ను ఓ కారు వేగంగా ఎదురుగా వచ్చి ' ఢీ ' కొట్టిన ఘటనలో టాక్సీ డ్రైవర్ కాలి బుగ్గిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సివిల్ డిఫెన్స్ తెల్పింది. ఈ ప్రమాదంపై త్వరితగతిన జోక్యం చేసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఈ వాహనాలు ఒకదానితో ఒకటి 'ఢీ' కొన్నాయి. దీంతో శుక్రవారం ఉదయం జెడ్డా-మక్కా వేగవంతమైన మార్గంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. కనీసం మరో రెండు కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయిని మక్కా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి నఇఫ్ అల్-షరీఫ్ చెప్పారు. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ మంటలలో సజీవ దహనం కాగా మరో ముగ్గురు ఈ ప్రమాదం నుండి రక్షించబడ్డారు. అగ్నికీలలలో బూడిదగా మాదిరిపోయిన ఆ కారు డ్రైవర్ ఎవరో వెంటనే గుర్తించబడలేదు. శుక్రవారం వేకువజామున 1గంటకు ఈ దుర్ఘటన జరిగింది. మక్కా నుండి అగ్నిమాపక బృందాలు హుటాహుటిన సన్నివేశానికి చేరుకొన్నారు తెలిపారు. అగ్నిమాపక దళాలు ఆయిల్ టాంకర్ ...కారు నుంచి వెలువడుతున్న మంటల్ని అదుపు చేసిన తర్వాత హైవేలో వెదచల్లబడిన చమురు తెట్టుని తొలగించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







