దోపిడీ కేసులో కోర్టుకు హాజరుకాని ఐదుగురు నిందితులకు జైలుశిక్ష
- April 22, 2017
దోహా:దేశం కానీ దేశం వచ్చి నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పారు .. అక్కడ ప్రజల కష్టార్జితాన్ని దోచుకొనే దొంగల ముఠాగా ఏర్పడి ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించారు. ఒక రోజు ఎంచక్కా దోహా పోలీసులకు దొరికిపోయారు..చేసిన తప్పులు ఒప్పుకొని న్యాయస్థానం ఎదుట వినయంగా ఉండాల్సింది పోయి.కోర్టుకి వెళ్లకుండా డుమ్మా కొట్టారు..ఆ ఫలితం అనుభవిస్తున్నారు. ఒక ఇంటి దోపిడీ కేసులో కోర్టుకు హాజరుకాని ఐదుగురు శ్రీలంక నిందితులకు, వీరికి పర్యాటక వీసాపై ఇచ్చిన వారితో సహా దోహా క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధించారు.గృహ దోపిడీ కోసం బహిష్కరణకు గురయ్యారు. కోర్టు ధర్మాసనం తెలిపిన వివరాల ప్రకారం ఈ ముద్దాయిలు మరొక వ్యక్తి ఇంట్లో తలుపులు పగుల కొట్టి ఆభరణాలు, ఖరీదైన బ్రాండ్గడియారాలు, మహిళల హ్యాండ్ బ్యాగులు మరియు ఇతర ఉపకరణాలు సహా 90,000 కతర్ రియళ్ళు కంటే ఎక్కువ విలువ వస్తువులను దొంగిలించారని ఆరోపించారు. అంతేకాకుండా, వారు దొంగిలించిన వస్తువులను వారి స్వదేశానికి పంపేవారు. దోపిడీకి గురి కాబడ్డ బాధితుడు, తన తల్లి వద్ద నుండి ఫోన్ కాల్ అందుకున్నప్పుడు, ఆ కుటుంబంలో విదేశాలకు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కొంతమంది ఇంటిలోపల ప్రవేశించారు, పైన పేర్కొన్న పలు విలువైన వస్తువులను దొంగిలించారు. పోలీసుల పరిశోధనలు ప్రకారం ఈ శ్రీలంక ముద్దాయిలు పలు ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగిలించడానికి సెలవుదినాలు సమయంలోఖాళీ ఇళ్ళు లక్ష్యంగా ఒక నేర ముఠాగా వీరంతా ఏర్పడినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









