38 మంది భారతీయుల నిర్బంధం బ్రిటన్‌లో
- April 23, 2017
వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో 38 మంది భారతీయులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్ జాతీయుడు కూడా అరెస్టు అయ్యాడు. లీచెస్టర్ నగరంలోని రెండు వస్త్ర కర్మాగారాలపై ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం గతవారం దాడులు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. 31 మంది వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే కొనసాగుతున్నారని, ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఒకరు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగం చేస్తున్నారని అధికారులను ఉటంకిస్తూ స్థానిక ‘లీచెస్టర్ మెర్క్యూరీ’ పత్రిక వెల్లడించింది. వీరిని ఉద్యోగులుగా చేర్చుకున్న రెండు కంపెనీలు...ఎంకే క్లాతింగ్ లిమిటెడ్, ఫ్యాషన్ టైమ్స్ యూకే లిమిటెడ్ పైనా భారీ జరిమానాలను విధించే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









