మమ్ముట్టి తనయుడు జెమిని గణేశన్ గా

- April 23, 2017 , by Maagulf
మమ్ముట్టి తనయుడు జెమిని గణేశన్ గా

యువ దర్శకుడు నాగ అశ్విన్ "ఎవడే సుబ్రమణ్యం" సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు.. తాజాగా తన రెండో సినిమా గా అలనాటి అందాల నటి "సావిత్రిని జీవిత చరిత్రను 'మహానటి' గా "  తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 10 నుంచి హైదరాబాద్ లో జరుపుకోనున్నది.. ఇప్పటికే సావిత్రిగా కీర్తి సురేష్ ను, మరో కీలక పాత్రలో సమంత ను ఎంపిక చేసిన సంగతి విధితమే.. కాగా సావిత్రి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి.. సావిత్రి భర్త జెమినీ గణేశన్.. ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉన్నది.. ఇప్పటికే ఇద్దరి .. ముగ్గురు హీరోల పేర్లు వినిపించినా.. చివరకు ఓ యంగ్ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మలయాళ నటుడు ముమ్ముట్టి తనయుడిగా అడుగు పెట్టి.. తన నటనతో అందరినీ ఆకట్టుకొన్న దుల్కర్ సల్మాన్ ను జెమినీ గణేశన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. దుల్కర్ ఇప్పటికే ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు.. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎన్టీఆర్, ఎన్నార్ ల పాత్రలు ఎంపిక చేయాల్సి ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com