వేసవి కానుకగా మే 19న ఏంజెల్ విడుదల
- April 24, 2017
నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రానున్న 'ఏంజెల్' టీజర్ తాజాగా విడుదలై విశేష స్పందన అందుకుంటోంది.ఇక ఇటీవలే చిత్రీకరణ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుట్ పుట్ చూసిన చిత్రబృందం, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న ఏంజెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తన కెరీర్ లోనే 'ఏంజెల్' గొప్ప సినిమా అవుతోందని హెబ్బా కాన్ఫీడెంట్ గా చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సప్తగిరి ఈ సినిమా రిలీజ్ తరువాత తను నెక్ట్స్ లెవల్ కి వెళ్తానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో నాగ అన్వేష్ ప్రదర్శీస్తోన్న నటన చూసి పలువురు సీనియర్ నటులు మెచ్చుకోవడం విశేషం.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









