ప్రయాణికులకు ఎయిర్ ఆసియా బంపర్ ఆఫర్..!!

- April 24, 2017 , by Maagulf
ప్రయాణికులకు ఎయిర్ ఆసియా బంపర్ ఆఫర్..!!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఆసియా ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పన్నులన్నింటితో కలిపి రూ.1099 నుంచి టికెట్‌ ధర ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌5 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 మధ్య ప్రయాణించే వారు ఈనెల 30లోపు టికెట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. బెంగళూరు, చండీగఢ్‌, గోవా, హైదరాబాద్‌, పుణె, విశాఖపట్నం మార్గాల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌ ఆసియా తెలిపింది. సంస్థ ప్రచారంలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com