స్వీట్ కార్న్ తింటే వార్ధక్య ఛాయలు రావట
- April 25, 2017
స్వీట్ కార్న్ తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లు దూరం కావడంతో పాటు వార్ధక్య ఛాయలు రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో కెలోరీలు తక్కువ. పీచు, విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
కంటిచూపు వయసు పెరిగేకొద్దీ కంటి చూపు మందగించడంతో పాటు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడంలో స్వీట్‌కార్న్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జియాగ్జాంథిన్ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
స్వీట్ కార్న్‌లో పుష్కలంగా ఉండే ఫొలేట్ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని థయామిన్ మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. స్వీట్‌కార్న్‌లోని ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఒక యాపిల్‌తో పోలిస్తే.. ఇందులో ఉండే తీపి శాతం తక్కువే. కాబట్టి మోతాదు మించకుండా వీటిని నిత్యం తీసుకోవచ్చు. స్వీట్‌కార్న్ తీసుకుంటే జీర్ణక్రియ తీరు మెరుగుపడుతుంది. అందుకు కారణం ఇందులో ఉండే పీచే. అలాగే మేలు చేసే బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









