పాకిస్థాన్‌లో బాంబు పేలుడు 10మంది మృతి
- April 25, 2017
-ఆరుగురు చిన్నారులు సహా 10మంది మృతి
పెషావర్: పాకిస్థాన్‌లోని ఖుర్రం గిరిజన ప్రాంతం కొంతారా గ్రామంలో తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఓ వ్యాన్ లక్ష్యంగా రిమోట్ కంట్రోల్‌తో శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 10 మంది మృతిచెందారు. గాయపడ్డ 13మందిని సమీపంలోని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు పెషావర్‌లో వైద్యసేవలు అందించేందుకు ఖుర్రం రాజధాని పరచినర్కు ఎంఐ-17 హెలీకాప్టర్ పంపించామని సైనిక సమాచార విభాగ అధికారులు తెలిపారు. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ చీలికవర్గ నేత జమ్మాతుల్ అహరర్ ఈ దాడి చేసినట్లు ప్రకటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







