దారుజులో ఆసియా దేశానికి చెందిన క్లీనర్ పై దాడి
- April 26, 2017
' పిచ్చుక మీదకు బ్రహ్మాస్త్రం వెనుకటికి ఎవరో గురిపెట్టారట ' ...అచ్చం అదే మాదిరిగా జీవనోపాథికి దేశం కానీ దేశం వచ్చిన ఓ పారిశ్యుద్ధ కార్మికుడిని స్వల్ప కారణం సాకుగా చూపి కొందరు అతి దారుణంగా గాయపర్చారు. వివరాలలోకి వెళితే, దారుజులో ఆసియా దేశానికి చెందిన ఒక క్లీనర్ పై దారుణంగా దాడి చేశారు. మొఖాలకు ముసుగులు ధరించిన బృందం అత్యంత పాశవికంగా గాయపరిచి తన పొరుగువారి ఇంటికి తిరిగి వచ్చి శుభ్రపర్చకూడదని తెలిపినట్లు నివేదికలు ధృవీకరించాయి.ఉత్తర ప్రాంతం మున్సిపాలిటీ జనరల్ డైరెక్టర్ యూసఫ్ అల్ ఘాతం మంగళవారం జారీ చేసిన ప్రకటనలో ఈ దాడిని ఖండించారు. ఈ నెల ఏప్రిల్ 23 వ తేదీన ధీరజ్ లో ఒక క్లీనర్ తన విధులునిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రాంతం శుభ్రం చేయడానికి వీల్లేదని బెదిరిస్తూ మొఖాలకు ముసుగులు ధరించిన ఒక సమూహం దాడి చేసిందని అల్ ఘటం చెప్పారు. నలుగురు ముసుగులు ధరించిన ఆగంతకులు బాధితుడిని తీవ్రంగా కొట్టి,గాయపర్చినట్లు ఆయన తన ప్రకటనలో వివరించారు.దాడి చేసిన బృందం అక్కడ శుభ్రం చేయడానికి అభ్యంతరం ఎందుకు వ్యక్తపర్చారో తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించడానికి ఉద్దేశం లోపల పెట్టుకొని అమాయకుడైన క్లీనర్ ను గాయపరచడం వలన తమ పట్ల అక్కడివారికి భయం కల్గించాలని లక్ష్యం నెరవేర్చుకొన్నారని ఆ అధికారిక తెలిపారు. ఈ సంఘటనను "వికారమైనది" అని అల్ ఘటం వివరించారు మరియు సభ్య సమాజంలో ఇటువంటి అనైతిక ప్రవర్తనలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









