సౌక్ అల్ హరాజ్‌లో షాప్‌లకు జరీమానా
- April 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, సౌక్ అల్ హరాజ్‌లోని షాప్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. దోహాలోని నజ్మా ఏరియాలో ఉన్న ఈ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడ్డవారికి జరీమానాలు విధించడం జరిగిందని అధికారులు తెలిపారు. మార్కెట్స్ మరియు కమర్షియల్ యాక్టివిటీస్‌లో ధరల మానిప్యులేషన్స్‌ని ఉల్లంఘనల్ని తగ్గించడానికి ఇలాంటి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 11 షాపులకు ధరల పట్టీని ప్రదర్శించకపోవడంపై జరీమానా విధించారు. ఒక్కో ఉల్లంఘనకు 6,000 ఖతారీ రియాల్స్ చొప్పున జరీమానా విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉల్లంఘనల్ని సహించబోమని మినిస్ట్రీ ఈ సందర్భంగా హెచ్చరించింది. వినియోగదారులు ఎవరైనా ఉల్లంఘనల్ని గుర్తిస్తే వెంటనే హాట్‌లైన్స్ ద్వారా సమాచారం అందింవచ్చునని మినిస్ట్రీ సూచించింది. ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అలాగే ఎంఇసి మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









