మాసిడోనియన్ పార్లమెంట్ పై దాడి, 100 మందికి పైగా గాయాలు
- April 28, 2017
మాసిడోనియన్ పార్లమెంట్ భవనంపై నిరనన కారులు జరిపిన దాడిలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పార్లమెంట్ స్పీకర్‌గా ఆల్బేనియన్ జాతీయుడు ఎన్నిక కావటం పట్ల తీవ్రంగా అసంతృప్తి చెందిన కొందరు పెద్ద సంఖ్యలో గురువారం సాయంత్రం పార్లమెంట్ భవనంపైకి తరలివచ్చారు. జాతీయ పతాకాలు చేతబూని, జాతీయ గీతం ఆలపించుకుంటూ పోలీసుల కార్డాన్ ఛేదించుకుని భవనం లోపలికి దూసుకెళ్లారు. చేతికందిన కుర్చీలు, బెంచీలను విరిచిపారేశారు. అడ్డువచ్చిన పోలీసులపైకి దూకారు.
ఈ దాడిలో గాయపడిన దాదాపు 102 మందికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. కొందరు పార్లమెంట్ సభ్యులు చిరిగిన దుస్తులు, గాయాలతో ప్రాణభయంతో భవనం వెలుపలికి పరుగెత్తుకుంటూ వచ్చారని భద్రతా విభాగం తెలిపింది. పదిమంది వరకు ఎంపీలు, మీడియా సిబ్బంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనను యూరోపియన్ యూనియన్‌తోపాటు అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









