పారిపోయిన పనిమనుషులు యజమానికి డబ్బులు చెల్లించాలని యూఏఈ కోర్టు ఆదేశాలు
- April 28, 2017
షార్జా: ఇంటి యజమాని నుంచి తప్పించుకున్నఇద్దరు పని మనుషులు వారి వారి యజమానులకు వీసా, వైద్య పరీక్షా ఛార్జీలతో సహా నియామక చెల్లింపులను చెల్లించాలని యూఏఈ న్యాయస్థానం ఆదేశించింది.యజమానికి అనుకూలంగా న్యాయవాది ఇమాన్ సబ్ట్ ద్వారా పారిపోయినవారిలో ఒకరిపై ఈ తీర్పు మొదలైంది.శ్రీలంకకు చెందిన ఇద్దరు పనిమనుషులు తమ యజమానికి దాదాపు 22,635 ధిర్హాం మొత్తంలో సగం పైగా చెల్లించాలనికోర్టు తీర్పు చెప్పింది.న్యాయమూర్తి ఇద్దరు నేరస్తులను దోషులుగా గుర్తించిన తరువాత, వారు యజమానితో జరిగిన ఒప్పందాలలోఆయా నిబంధనలకు అనుగుణంగా ఏమీ చేయలేదని ఆ తీర్పు ఇవ్వబడింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు జూలై 1, 2014 న ప్రారంభమయ్యాయి, యజమాని తన ఇద్దరు ఉద్యోగులను స్థానిక సంస్థ ద్వారా నియమించారు. మొట్టమొదటి మహిళ నానీగా పని చేయాల్సి ఉంది మరియు రెండవ మహిళను పనిమనిషిగా ఆ యజమాని వద్ద పనిచేయసాగారు. మొదటి పని మనిషి ఆరు నెలలు ఉద్యోగం చేసి అక్కడ నుంచి పారిపోయింది. రెండవ పని మనిషి ఏడు నెలల తర్వాత తప్పించుకున్నాడు.
తాజా వార్తలు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!









