హారర్ సినిమాగా రాబోతున్న 'టిక్‌టాక్‌'

- April 28, 2017 , by Maagulf
హారర్ సినిమాగా రాబోతున్న 'టిక్‌టాక్‌'

పి.హెచ్ ప్రొడక్షన్స్ పతాకంపై పొలిచర్ల హరినాథ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'టిక్‌ టాక్‌'. నిషిగంద, మౌనిక నాయకలు. లవ్‌, హారర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు. హరినాథ్‌ మాట్లాడుతూ ''హారర్‌ కామెడీ జోనర్‌లో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలను మిళితం చేసి రూపొందించిన సినిమా ఇది. అశ్లీలతకు చోటులేకుండా కుటుంబ సభ్యులంతా చూసేలా ఉంటుంది. వచ్చే రెండేళ్లల్లో నాలుగు సినిమాను ప్లాన్ చేస్తున్నా'' అని అన్నారు. ప్రసన్నకుమార్‌, నిషిగంద, మౌనిక, రాహుల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com