శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం
- April 28, 2017
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శుక్రవారం ముగ్గురు వ్యక్తుల నుంచి 1.23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, అబుదాబి నుంచి వచ్చి న ఈ ముగ్గురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగా రం విలువ మార్కెట్‌లో రూ. 36.09 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పసిడిని రవాణా చేసిన విధానం, తీసుకువచ్చిన ప్యాసింజర్ల ప్రొఫైలింగ్ ఆధారంగా ఇది వ్యవస్థీకృత స్మగ్లింగ్ కాకపోవచ్చని, వ్యక్తిగత అవసరాల కోసమే తెచ్చుకుని ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా నుంచి అబుదాబి మీదుగా వచ్చే విమానం లో శంషాబాద్ చేరుకున్న ఓ వ్యక్తి 342 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని 8 కడియాల రూపంలో తీసుకువచ్చాడు. అబుదాబి నుంచి వచ్చిన విమానంలో దిగిన ఇద్దరిలో ఒకరు 387 గ్రాముల బంగారాన్ని రెండు గొలుసుల రూపంలోనూ, మరొకరు 507 గ్రాముల బంగారాన్ని గాజుల రూపంలోనూ తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







