కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించిన ట్రంప్ ప్రభుత్వం
- April 28, 2017అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారీ ఎత్తున పన్నుల సంస్కరణలను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కార్పొరేట్ 35 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల్లో దాచిన వేలకోట్ల డాలర్లను స్వచ్ఛందంగా ప్రకటించి వెనక్కి తెస్తే ఏకమొత్తంగా ఒకేసారి పన్ను విధిస్తారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రెట్టింపు చేయడంతో పాటు చిన్న పిల్లలు, తమపై ఆధారపడిన వృద్ధులు ఉన్న కుటుంబాలకు పన్ను రాయితీలు కల్పించారు. విదేశాల్లో దాచిన వేలకోట్ల డాలర్లను స్వచ్ఛందంగా ప్రకటించి వెనక్కి తీసుకుంటే ఏకమొత్తంగా ఒకేసారి పన్ను విధిస్తారు. ఈ విధానాల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తోంది. ఈ పన్ను ప్రతిపాదనలన్నింటిపైనా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపి తుది ప్రతిపాదనలను ఖరారు చేస్తారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!