జర్నలిస్ట్‌గా నటించనున్న ప్రముఖ హీరో అర్జున్ కుమార్తె

- April 28, 2017 , by Maagulf
జర్నలిస్ట్‌గా నటించనున్న ప్రముఖ హీరో అర్జున్ కుమార్తె

శ్రీరామ్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై యాక్షనకింగ్‌ అర్జున్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కాదలిన్ పొన్ వీధియిల్‌'. తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు చంద్రన్ హీరోగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ చిత్రంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. టైటిల్‌ని బట్టి పక్కా లవ్‌ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోందని భావిస్తున్న సినీ అభిమానులకు షాకిస్తూ... అర్జున్ తన గత చిత్రాల తరహాలోనే దేశభక్తి అంశాన్ని జోడిస్తున్నట్లు తెలుస్తోంది. యూత్‌కి నచ్చే లవ్‌ ఎపిసోడ్‌తోపాటు అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా 'కాదలిన్ పొన్ వీధియిల్‌' రూపొందుతోంది. కథ ప్రకారం ఐశ్వర్య టీవీ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com