మదురై విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టివేత
- October 04, 2015
మదురై ఎయిర్ పోర్ట్ లో ఆదివారం భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోలంబో, దుబాయిల నుండి వచ్చిన విమానాల్లో దాదాపు 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. అనంతరం సదరు విమానాల్లో ప్రయాణించిన 10 మంది ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులను అప్పగించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 8.38 కోట్లు ఉంటుందని డీఆర్ ఐ అధికారులు తెలిపారు. సదరు విమానాల్లో భారీగా బంగారం అక్రమ రవాణా అవుతున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈ విమానాలు ఎయిర్ పోర్ట్ చేరుకోగానే.... కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







