అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినవారికి చేయూత
- April 29, 2017
వంద మందికి పైగా కార్మికులు, తాము నివాసం ఉంటోన్న క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయారు. బట్టలు, తమకు సంబంధించిన వస్తువులు, డబ్బులు సైతం ఈ ప్రమాదంలో కాలిపోయాయి. మొత్తం 160 మంది కార్మికులు ఈ అగ్ని ప్రమాదంతో రోడ్డునపడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ వారందరినీ వారి సన్నిహితులు ఆదుకున్నారు. తాము నివాసం ఉంటోన్న చోట వారికి ఆశ్రయం కూఆ కల్పించారు. వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, ప్రమాదం గుర్తించిన వెంటనే అందరం అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నామని పాకిస్తానీ కార్మికుడైన మొహమ్మద్ మసూద్ చెప్పారు. ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బాధితులకు తగిన సహాయం అందజేస్తామని వారు పనిచేస్తోన్న సంస్థ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







