'ఒక్కడు మిగిలాడు' షూటింగ్ పూర్తి
- April 29, 2017
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం "ఒక్కడు మిగిలాడు". అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ రేపటితో పూర్తవుతుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అలియాస్ జానకి ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. అనీషా ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తోంది.
అనీషా ఆంబ్రోస్ పాత్ర గురించి దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి మాట్లాడుతూ.. "అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ గా మంచి పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఒక నటిగా అనీషాకు మంచి పేరు తెచ్చిపెడుతుందీ చిత్రం" అన్నారు.
చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "ఇటీవల విడుదలైన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలోనే మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్ ను కూడా విడుదల చేయనున్నాం. రేపటితో హైద్రాబాద్ లో గత కొన్ని రోజులుగా షూట్ చేస్తున్న లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం" అన్నారు.
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి!
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







