మంచు మనోజ్ ద్విపాత్రాభినయం
- April 29, 2017
మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ఎస్.ఎన.రెడ్డి, లక్ష్మీకాంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారంతో చివరి షెడ్యూల్ పూర్తవుతుంది. కథానాయిక ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ''1990ల కాలంనాటి శ్రీలంక యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు.
అనీషా ఆంబ్రోస్ జర్నలిస్ట్‌గా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం. ఇటీవల విడుదల చేసిన హీరో లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆదివారంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండరామరాజు, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సంగీతం: శివ నందిగామ, స్కీనప్లే: గోపీమోహన్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







