అమరావతి ప్రాంతంలో సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు ఎన్నారైల తోడ్పాటు
- April 30, 2017
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేయడానికి అనేకమంది ఎన్నారైలు ముం దుకు వస్తున్నట్లు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ తెలిపారు. విభజన తరువాత నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో చికాగోలో నాట్స్ తెలుగు సంబరాలకు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తదితరులకు ఆహ్వానాలను అందించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రధానంగా డిజిటల్ తరగతులు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. జన్మభూమి, చదువుకున్న విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని మోహనకృష్ణ స్పష్టం చేశారు.
మంచి విద్యాసంస్థలను ఎన్నుకోవాలి
ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చేవారు మంచి విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ తెలిపారు. గుర్తింపుల్లేని సంస్థల్లో చేరి ఇబ్బందులు పడవద్దని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







