చంద్రబాబు మేకిన్ ఏపీ టార్గెట్‌గా యూఎస్ టూర్
- May 01, 2017
మేకిన్ ఏపీ టార్గెట్‌గా US పర్యటనకు వెళుతున్నారు చంద్రబాబు. సీఎం నేతృత్వంలో పర్యటించనున్న బృందం.. పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది. US-ఇండియా బిజినెస్ సమ్మిట్లోను పాల్గొంటారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. మేకిన్ ఏపీ లక్ష్యంగా అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. మే 4 నుంచి 11 వరకు సీఎం నేతృత్వంలో బృందం అమెరికాలో పర్యటించనుంది. సీఎం వెంట మంత్రులు యనమల, నారా లోకేష్ సహా 17మంది యూఎస్ వెళుతున్నారు. సీఎం బృందం వాషింగ్టన్, సాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగుల్లో పర్యటించనుంది. అలాగే యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్‌లో పాల్గొనుంది. ఈ టూర్లో ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది. టూర్లో భాగంగా అయోవా స్టేట్‌లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. అలాగే గ్లోబల్ క్లైమెట్ లీడర్‌షిప్‌లో కాలిఫోర్నియాతో ఒప్పందం చేసుకోనున్నారు. మే 4న ఒరాకిల్, 5న యాపిల్, గూగుల్, 8న సిస్కో కంపెనీలలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లనున్నారు. అమెరికా పర్యటనలో కీలక ఒప్పందాలతో పాటు... పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీకానుంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి వివరించనున్నారు.
తాజా వార్తలు
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ









