మదీనా బాంబు దాడులకు సంబంధించి 46 అనుమానితులు అరెస్టు

- May 01, 2017 , by Maagulf
మదీనా బాంబు దాడులకు సంబంధించి 46 అనుమానితులు అరెస్టు

మ‌దీనాలో ఉన్న ప్రొపేట్స్ మ‌సీదులో విధ్వంసం చేయ‌డానికి సౌదీకి వ‌చ్చిన అల్-హరాజాత్కు చెందిన 46 మంది తీవ్ర‌వాదుల‌ను అరెస్ట్ చేసినట్లు  మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ మన్సూర్ అల్-టర్కి ఆదివారం చెప్పారు. వారిలో 32 మంది సౌదీకి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. మిగ‌తా 14 మంది పాకిస్తాన్, అఫ్ఘ‌నిస్తాన్, జోర్డాన్, సూడాన్, ఈజిప్టుల‌కు చెందిన‌వారుగా గుర్తించ‌మ‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌పంచంలో ముస్లీంల‌కు రెండో ప‌విత్ర స్థ‌ల‌మైన ప్రొఫెట్స్ మ‌సీదులో భ‌యాన‌క‌వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు వారు మానామా వ‌చ్చార‌ని పోలీసులు తెలిపారు. జేడ్డాలో ఒక ఇంట్లో గ‌దిని అద్దెకు తీసుకున్న ఇద్ద‌రు వ్య‌క్తులు బాంబులు తయారు చేస్తున్నార‌ని పోలీసులకు స‌మాచార‌మందింది. దాంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.గ‌త సంవ‌త్స‌రం జూలైలో ప్రొఫెట్స్ మ‌సీదులో సుసైడ్ బాంబ‌ర్ ఉప‌యోగించిన బాంబులు అక్క‌డే త‌యారు చేసిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా వారి కుట్ర బ‌య‌ట‌ప‌డింది. దాదాపు రెండు సంవ‌త్ప‌రాలుగా తాము ఇదే ప‌నిచేస్తున్నామ‌ని మ‌సీదుల్లో అందరూ ప్రార్థ‌నలు చేస్తుండ‌గా బాంబుల‌తో విరుచుకుప‌డాల‌ని త‌మ నాయ‌కుడు త‌మ‌కు ఆదేశాలిచ్చాడ‌ని వారు పేర్కొన్నారు. వారిచ్చిన స‌మాచారం ఆధారంగా పోలీసులు ప‌కడ్భంది చ‌ర్య‌లు చేప‌ట్టి, మిగ‌తా వారిని అరెస్ట్ చేశామ‌న్నారు." మా భద్రతను కాపాడగలుగుతారు మరియు అన్ని సందర్భాల్లోనూ వ్యవహరించడానికి భద్రతా సిబ్బంది తగినంత వనరులను కలిగి ఉంటారని ఆల్-టర్కి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com