ఇండియన్ శారీ, ఐడల్ వేర్ ఈవెంట్
- May 02, 2017
మస్కట్: సుల్తానేట్‌లో ఇండియా అంబాసిడర్ సుష్మా పాండే, ఇండియన్ ఎథ్నిక్ శారీ మరియు బ్రైడల్ వేర్ షోను ఏర్పాటు చేశారు. మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ వద్ద ఈ ఈవెంట్ జరిగింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శారీకి వున్న ప్రాధాన్యతను ఈ సందర్బంగా ఆమె వివరించారు. అలాగే ఇండియన్ బ్రైడల్ వేర్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ఆమె తెలియజేశారు. ఆరు గజాల చీర, కంఫర్ట్‌కి పెట్టింది పేరనీ, చీరలో ఉండే అందం ఇంకెక్కడా ఉండదని వివిధ దేశాలకు చెందిన మహిళలే చెబుతుంటారని ఆమె అన్నారు. చీరకట్టులో ఎన్నెన్నో రకాలున్నాయనీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కట్టే చీర మహిళలకు సరికొత్త అందాన్నిస్తుందని చెప్పారు సుష్మా పాండే. ప్రస్తుత మోడ్రన్ ట్రెండ్‌లోనూ శారీ సరికొత్తగా మహిళల అందాన్ని పెంచుతోందనీ, శారీ రూపకల్పనలో విప్లవాత్మక మార్పులే కాకుండా, వివిధ ట్రెండ్స్‌తో శారీని సరికొత్తగా డిజైన్ చేయడం కూడా జరుగుతోందని ఆమె వెల్లడించారు. లులు హైపర్ మార్కెట్ నుంచి సేకరించిన ఎథ్నిక్ శారీ కలెక్షన్ ఎగ్జిబిషన్‌ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు మహిళలు, అలాగే డిప్లమాట్స్ సతీమణులు, ఒమనీ బిజినెస్ విమెన్, మినిస్ట్రీలకు చెందిన పలువురు మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







