ముంబై నుంచి అబుదాబికి ఎమాన్ అహ్మద్
- May 02, 2017
ప్రపంచంలోనే అత్యంత బరువు కలిగిన మహిళగా పేరు పొందిన ఈజిప్టు మహిళ ఇమాన్ అహ్మద్‌ను బుధవారం తెల్లవారుజాము 2గంటలకు ప్రత్యేక విమానంలో అబుదాబి తరలించనున్నారు. ఎమాన్‌కు సరిపోయే విధంగా ప్రత్యేకమైన సదుపాయాలతో ఏర్పాటు చేసిన కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ముంబయి విమానాశ్రయం నుంచి తరలిస్తున్నట్లు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఎంఐఏఎల్) అధికారులు వెల్లడించారు. బరువు తగ్గించుకునే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునేందుకు ఫిబ్రవరి 11న ఎమాన్ ముంబయిలోని సైఫీ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు సరైన చికిత్స అందించడం లేదని.. వైద్యం చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నట్లు ఎమాన్ సోదరి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబయి నుంచి అబుదాబికి తరలిస్తున్నట్లు ఆమె సోదరి తెలిపారు.
అబుదాబికి చెందిన బుర్జీల్ ఆసుపత్రిలో తొమ్మిది మంది వైద్యబృందం నేతృత్వంలో ఆమెకు చికిత్స అందించనున్నట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎమాన్ చికిత్సకు సంబంధించిన దాదాపు పదివేల మెడికల్ రికార్డులను అబుదాబి వీపీఎస్ హెల్త్‌కేర్ సిబ్బందికి ప్రత్యేక విమానంలో పంపించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









