సిరియా శరణార్థి శిబిరంపై ఐసిస్ ఆత్మాహుతి దాడి 32మంది పౌరులు మరణం
- May 02, 2017
సిరియా శరణార్థ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32మంది పౌరులు మరణించారు. మూడొందల కుటుంబాలు నివసిస్తున్న ఈ తాత్కాలిక శిబిరంపై మంగళవారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈశాన్య సిరియాలో ఎస్‌డిఎఫ్ ఆధీనంలో ఉన్న హసాకే పట్టణంలోకి ప్రవేశించేందుకు వీలుగా వీరికి ఈ శిబిరంలో ఆశ్రయం కల్పించారు. ఈ శిబిరంలోపలా, వెలుపలా మొత్తం ఐదుసార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయని సిరియా మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ దాడి జరిగిన వెంటనే ఐసిస్-ఎస్‌డిఎఫ్ దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయని, మృతుల్లో 21మంది సిరియా లేదా ఇరాక్ శరణార్థు తెలిపింది. గాయపడిన 30మందిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టూ వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







