మరో సారి మంచి మనసు చాటుకొన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్
- May 03, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ మే 28 యూఎస్ లో జరగనున్న తానా సభలకు నిర్వాహకులనుంచి ఆహ్వానం అందుకొన్నారు. కల్యాణ్ రామ్ అక్కడ స్థానికంగా తానా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. కాగా వేడుకకు కళ్యాణ్ రామ్ తో పాటు మరికొందరి సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఈ నేపద్యంలో కల్యాణ్ రామ్ తన మంచి మనసునుని చాటుకున్నాడు.. సాధారణంగా ఇలాంటి వేడుకలకు సెలబ్రేటీలను ఆహ్వానిస్తే నిర్వాహకులే సెలబ్రిటీల ప్రయాణ, బస ఖర్చులను భరించాల్సి ఉంది.. ఆ మొత్తం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో తానా సభ్యులు కూడా కళ్యాణ్ రామ్ కు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పగా కళ్యాణ్ రామ్ మాత్రం వాళ్ళ ఆఫర్ ను తిరస్కరించారట. తన ఖర్చులన్నీ తానే పెట్టుకొని ఈ వేడుకలకు హాజరవుతానని.. చెప్పడమే కాదు... తన ఖర్చుల నిమిత్తం కేటాయించిన డబ్బుని అక్కడ స్థానికంగా చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం వినియోగించమని చెప్పాడట..
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







