స్ట్రీట్‌ వెండర్స్‌పై ఆకస్మిక తనిఖీలు

- May 03, 2017 , by Maagulf
స్ట్రీట్‌ వెండర్స్‌పై ఆకస్మిక తనిఖీలు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌, పెడ్లర్స్‌ మరియు స్ట్రీట్‌ వెండర్స్‌పై ఆకస్మిక తనిఖీల్ని నిర్వహించింది. దోహా కార్నిచ్‌, అల్‌ వక్రా మరియు అల్‌ దయాన్‌లో ఈ తనిఖీలు జరిగాయి. నిబంధనల్ని ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు జరుపుతున్నందున ఈ తనిఖీల్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 16 విభిన్నమైన ఉల్లంఘనలకుగాను చర్యలు తీసుకోబడ్తాయని వారు వివరించారు. ఇందులో వర్కర్స్‌ అకామడేషన్స్‌ని గ్రాసరీ మరియు రెస్టారెంట్స్‌గా వినియోగించడం, అది కూడా తగిన లైసెన్స్‌ లేకుండా చేయడం, అలాగే లైసెన్స్‌ లేకుండా పెట్రోల్‌ స్టేషన్‌ రిటైల్‌ బిజినెస్‌ని నిర్వహిస్తుండడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. ఉల్లంఘనలకు పాల్పడ్డ స్ట్రీట్‌ వెండర్స్‌ని సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కి రిఫర్‌ చేశారు. అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com