వీసా బ్యాన్ నిబంధన సడలింపుపై ఆశలు
- October 04, 2015
ఒమాన్లో వీసా బ్యాన్ నిబంధనల సడలింపుపై వలస ఉద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. రెండేళ్ళ వీసా బ్యాన్ నిబంధనల్లో సడలింపులు రావొచ్చని సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం. మానవ వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు సైద్ బిన్ నాజర్ అల్ సదీ మాట్లాడుతూ, తమ ఒప్పందాలను క్లియర్ చేసుకుని, నిబంధనలకు తగ్గట్టుగా వ్యవహరిస్తే వీసా ఆ్యన్‌పై పునరాలోచించే అవకాశం ఉంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి' అని చెప్పారు. గత సంవత్సరం రాయల్ ఒమన్ పోలీసులు, 2014 జులై 1 తర్వాత వలస ఉద్యోగులకు వీసాలు మంజూరు చేయడం కుదరదనీ, ఇదివరకు సుల్తానేట్‌లో ఉద్యోగం చేసి, నిబంధనల ప్రకారం రెండేళ్ళు పూర్తిగా ఉద్యోగం చేయనివారికి ఇది వర్తిస్తుందనీ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో జరిగిన చర్చల్లో నిబంధనలు సడలించాలనే ప్రతిపాదన వచ్చింది. దాంతో సమాలోచనలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సలహాదారుల ఆలోచనల్ని స్వాగతించారు. లేబర్ మార్కెట్‌పై ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపవచ్చని ఓ నిర్మాణ సంస్థకు చెందిన అధికారి చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







