గోవా లో త్వరలో టూ వీలర్ అంబులెన్స్‌లు

- May 05, 2017 , by Maagulf
గోవా లో త్వరలో టూ వీలర్ అంబులెన్స్‌లు

త్వరలో టూ వీలర్‌ అంబులెన్స్‌లు రాబోతున్నాయి. గోవాకు చెందిన ఆరోగ్యశాఖ వీటిని ప్రవేశపెట్టబోతుంది. టూరిజం శాఖ సహకారంతో వీటిని జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే స్పష్టం చేశారు. పారామెడికోలు ఈ టూవీలర్‌ అంబులెన్స్‌లతో వస్తారని, రోడ్డు ప్రమాదాల చోటుకైనా మరే ఇతర ప్రమాదం జరిగిన సకాలంలో చేరుకొని సేవలు అందిస్తారని చెప్పారు.
రోగికి ప్రాథమిక చికిత్స అందించి ప్రధాన చికిత్స పొందేవరకు ప్రాణాలు కాపాడగలిగేన్ని వస్తువులు ఈ టూవీలర్‌ అంబులెన్స్‌లో ఉంటాయని తెలిపారు. తమ రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ సేవలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం చెప్పారు. జూలై నెలలో ఉన్నపలంగా 22 టూబీలర్‌ అంబులెన్స్‌లను ప్రారంభించి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com