నాగార్జున సినిమా త్వరలో విడుదల

- October 04, 2015 , by Maagulf
నాగార్జున సినిమా త్వరలో విడుదల

మనం సినిమా తర్వాత నాగార్జున ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. సోగ్గాడే చిన్ని నాయన్ సినిమా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతోంది. నాగార్జున ఈ సినిమాలో ద్వి పాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తండ్రి పాత్ర చనిపోయాక కేవలం కొడుక్కే కనపదుతుందట. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పంచుతుందని నాగ్ నమ్మకంగా వున్నారు. నాగార్జున చివరిగా 2001లో వచ్చిన ఎదురులేని మనిషి సినిమాలో రెండు పాత్రల్లో కనపడ్డారు. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడి సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించగా బుల్లితెర యాంకర్ అనసూయ మరదలిగా గిలిగింతలు పెట్టనుంది. ఉయ్యాల జంపాల ఫేమ్ రామ్మోహన్ కథని కళ్యాన్ కృష్ణ తెరకెక్కించారు. ఇటీవల మైసూర్ లో జరిగిన షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో వుంది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com