ఖతారీ జలాల్లోని చేపలతో ప్రమాదం లేదు
- May 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్, ఖతారీ జలాల్లోని చేపల్లో టాక్సిక్ అవశేషాలున్నాయనీ, ఆ కారణంగా వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదనీ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. వివిధ మార్గాల్లో ఖతారీ జలాల్లోని చేపలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రజల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో కొన్ని చేపల్ని అలాగే ఖతారీ జలాల్నీ పరిశోధనకు పంపింది. ఆ పరిశోధన వివరాల్ని కూడా అధికారులు వివరించారు. ఖతారీ జలాల్లోని చేపలు పూర్తిగా సురక్షితమైనవని పేర్కొంటూ, ఎక్కడా ఎలాంటి టాక్సిక్ మెటీరియల్ జాడ కూడా పరిశోధనల్లో దొరకలేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చేపల్ని తినాలనుకునేవారు నిరభ్యంతరంగా తినవచ్చునని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







