అబూ హమౌర్ సెంట్రల్ మార్కెట్లో ఉల్లంఘనలకు పాల్పడిన100 మంది పట్టివేత
- May 06, 2017
కతర్:అబు హమార్ ప్రాంతంలో ఉన్న కేంద్ర మార్కెట్లో 102 ఉల్లంఘనలకు పాల్పడిన పలువురిని అదుపులోనికి తీసుకొన్నారు.ఆర్ధిక మరియు వాణిజ్య (ఎంఇసి), మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రిత్వశాఖ (ఎంఎంఇ) నిర్వహించిన ఉమ్మడి తనిఖీ కార్యక్రమం గురువారం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యల కోసం నిందితులను సమర్థవంతమైన భద్రతా అధికారులకు అప్పగించినట్లు ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎంఇసి),ఒక ప్రకటనలో తెలిపింది.వీరు ఎటువంటి లైసెన్సు లేకుండా అమ్మకం జరపడం మరియు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆయా వీధి విక్రేతలపై ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఈ ఉల్లంఘనలలో మరికొందరు లైసెన్సుల లేకుండా బరువులు మోసే కూలీలుగా అక్రమంగా పని చేస్తున్నారు. లైసెన్సుల లేకుండా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్నారని తెలిపారు. ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసే సమయంలో కొందరు లైసెన్స్ లేని వీధి విక్రేతలు వాహనాలు, తమ ఆస్తులను విడిచిపెట్టి పారిపోయినవారి అనేక జంతువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







