మటన్ రిసిపీ డాటా స్టయిల్
- May 06, 2017
కావలసిన పదార్థాలు: మటన్: అరకిలో, గుడ్లు: ఆరు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు, టమోటాలు: మూడు(చిన్నగా ముక్కలు చేసుకోవాలి), బ్రెడ్ ముక్కలు: రెండు (నీటిలో నానపెట్టుకోవాలి), బాదం, జీడిపప్పు: ఐదారు స్పూన్లు, పచ్చిమిరపకాయలు: ఆరు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), కారం: తగినంత, మిరియాల పొడి: రెండు టేబుల్ స్పూను, జీలకర్ర పొడి: రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు: కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: కప్పు, కొత్తిమీర తగినంత, ఉల్లిపాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి).
తయారీవిధానం: జీడిపప్పు, బాదం పప్పులను ముందురోజు రాత్రి నానపెట్టి తెల్లవారి వాటిని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. మటన్ ముక్కలను శుభ్రం చేసుకొని వాటిని అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఓ గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత జీడిపప్పు ముద్ద వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్న సమయంలో నానపెట్టి వుంచుకున్న మటన్ ముక్కలను వేసి నీరు పోయకుండా ఉడికించాలి. ఇప్పుడు టమోటా ముక్కలనువేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించాలి. మటన్ ఉడికిన తరువాత నానపెట్టిన బ్రెడ్ ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు గుడ్లు పగులకొట్టి ఉప్పు, కారం వేసి బాగా గిలకొట్టాలి. అందులో సగ భాగాన్ని పాన్‌లో ఆమ్లెట్‌లాగా వేసుకోవాలి. ఓవెన్ బౌల్ అడుగుభాగాన ఈ ఆమ్లెట్‌ను, పై భాగాన ఉడికిన మటన్ కర్రీ వేసి పైన మిగిలిన గుడ్లును పలుచగా పరిచి, ఓవెన్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్‌లోంచి బయటకు తీసిన తరువాత పైన కొత్తిమీర చల్లుకోవాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









