కరాచీ నుండి ముంబై కి విమానాలు లేవు
- May 07, 2017
ఇస్లామాబాద్ : కరాచీ-ముంబయి మార్గంలో తిరిగే విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) తెలిపింది. వాణిజ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరాచీ-ముంబయి మార్గంలో పీఐఏ వారంలో రెండు(సోమ, గురు) విమాన సర్వీసులను నడుపుతోంది. సోమవారం నుంచి వీటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే లాహోర్-దిల్లీ మార్గంలో సర్వీసులు యథావిధిగా తిరుగుతాయని పీఐఏ తెలిపింది.
‘మే 8 నుంచి కరాచీ-ముంబయి మార్గంలో పీఐఏ విమాన సర్వీసులు తిరగవు. ఈ మార్గంలో బుకింగ్స్ కూడా నిలిపివేశాం.’ అని ఓ పీఐఏ అధికారి వెల్లడించారు. ఈ మార్గంలో తక్కువ ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వీసుల రద్దుతో లాహోర్-దిల్లీ మార్గంలో రద్దీ పెరుగుతోందని భావిస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఈ మార్గంలో నష్టాల కారణంగా వీటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ ఇస్తే తప్ప భవిష్యత్‌లో ఈ మార్గంలో విమానాలను తిప్పలేమని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల భారత్-పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వస్తున్న వార్తలను పీఐఏ యాజమాన్యం ఖండించింది. కేవలం వాణిజ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకన్నామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







