దుబలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రయత్నం..అడ్డుకొన్న సరిహద్దు గస్తీ దళం
- May 08, 2017
జెడ్డా: తకుక్ గవర్నరేట్ పరిధిలో గురువారం ఈజిప్టు ప్రాదేశిక జలాల నుండి సౌదీ భూభాగ జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఓడలో 900,000 క్యాప్కాన్ మాదక ద్రవ్య మాత్రలు అక్రమంగా తరలించేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. ఈ అక్రమ చొరబాటుని దుబూ నగరంలోని సరిహద్దు గస్తీ దళ అధికారులు సమర్ధవంతంగా నిలువరించారు.బోర్డర్ గార్డ్స్ అధికారిక ప్రతినిధి కమోదర్ సాహ్ర్ బిన్ మహ్మద్ అల్-హర్బి మాట్లాడుతూ, తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పర్యవేక్షణా పరికరాలు పెద్ద మొత్తం అత్యంత విలువైన మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు సౌదీ జలాలలోనికి ప్రవేశించిన ఒక పడవను గుర్తించాయని ఆయన తెలిపారు."పడవ వెంటనే అడ్డగించి తనిఖీ చేయడం జరిగిందన్నారు. పడవ పై భాగాన ఉన్న కొందరు దుండుగులు తనిఖీ సమయంలో కొన్ని క్యాప్కాన్ మాత్రలు ఉన్నప్లాస్టిక్ పెట్టెలను సముద్రంలోకి విసిరివేయడం జరిగింది. ఇది గమనించిన అధికారులు వాటిని సేకరించి సముద్రంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఈజిప్షియన్లు అరెస్టు చేశామని ఆయన తెలిపారు. వారు మాదకద్రవ్యాలను అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని ఆల్-హర్బి చెప్పారు, ఆయా పెట్టాలను క్షుణంగా పరిశీలన చేసిన తర్వాత 900,000 వారు క్యాప్కాన్ మాత్రలు కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. దేశంలోని మాదకద్రవ్యాలను ప్రవేశపెట్టడంని నిలువరించి కింగ్డమ్ లోని యువతకు రక్షణ కల్పించడం ద్వారా అక్రమ రవాణాదారులను నివారించడానికి కింగ్డమ్ సరిహద్దు గార్డులు నిరాటంకంగా పనిచేస్తారని అల్-హర్బి తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







