ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగా సీడ్ పార్కు
- May 08, 2017
సుముఖత వ్యక్తం చేసిన ఐయోవా స్టేట్ యూనివర్సిటీ
- వర్సిటీ డీన్‌తో సమావేశమైన చంద్రబాబు బృందం
ఐయోవా స్టేట్ యూనివర్సిటీ ఏపీలో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐయోవా స్టేట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ వెండీ వింటర్ స్టీన్ అంకురార్పణ చేసినట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగోరోజు అమెరికా పర్యటన వివరాలను తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి బృందం నాలుగోరోజు ఐయోవా స్టేట్ యూనివర్సిటీని సందర్శించింది. విత్తనాభివృద్ధి, పరిశోధనా రంగంలో సహకారం అందించేందుకు యూనివర్సిటీ అంగీకరించింది. రాష్ట్రంలో మెగా సీడ్ పార్కు నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరగా ఇందుకు యూనివర్సిటీ సుముఖత వ్యక్తం చేసింది. అంతకుముందు ఐయోవా రాష్ట్ర వ్యవసాయ మంత్రి బిల్ నోర్తి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్‌న్ అధ్యక్షుడు కెన్నెత్ క్విన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.
తెలుగువారంతా బాహుబలులే: ఐయోవా పర్యటన తర్వాత శాన్ హుజ్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ శాన్ హుజ్ మేయర్ సామ్ లికార్డో, కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా, సెనెటర్ బాబ్ వెల్ కౌస్కీ, అసెంబ్లీ సభ్యులు కాన్సాన్, ఆస్ కల్రాలను సీఎం కలిశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







