ఏపీ సీఎం చంద్రబాబుకు 'ట్రాన్స్‌ఫార్మేటివ్ సీఎం' అవార్డు
- May 08, 2017
అమెరికాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్( USIBC ) రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సులో ‘ట్రాన్స్‌ఫార్మేటివ్ సీఎం’ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం చంద్రబాబువరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంతో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు నుటనిక్స్ సంస్థ ముందుకొచ్చింది. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో వస్తామని సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
అనంతరం పట్రా కార్ప్ సీఈవో జాన్ ఎస్ సింప్సన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్ బీపీవో సంస్థ విస్తరణ పట్ల ఆసక్తి కనబరుస్తోంది. విశాఖలో ఇప్పటికే 1500 ఉద్యోగాలు కల్పించిన సంస్థ స్థలం కొరత కారణంగా నయా రాయ్‌పూర్‌కు 500 ఉద్యోగాలు తరలిపోయిన విషయాన్ని ప్రస్తావించింది. విశాఖలో తగిన స్థలం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పించేవాళ్లమని స్పష్టం చేసింది. వెంటనే స్పందించిన చంద్రబాబు ఈ సంస్థకు టెక్ మహీంద్రా బిల్డింగ్ కేటాయించాలని ఏపీఐఐసీని ఆదేశించారు.
తర్వాత వీసా కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంబాసిడర్ డెమెట్రియస్ మరంటీస్ , బెల్ కర్వ్ ల్యాబ్స్‌లో ప్రతినిధులోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. మొబిలిటీ ఇన్ఫాస్ట్రక్చర్ గ్రూప్ సీఎండీ డాక్టర్ రవీంద్ర వర్మతో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే , రాయ్‌పూర్-విశాఖ హైవేల నిర్మాణాలపై ఈ సంస్థ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. అనంతరం sunrise andhra pradesh transformational journey towards a happy state అనే ద్వైపాక్షిక సదస్సులో పాల్గొని కీలకోపన్యాసం చేశారు.
సీఎం కోర్ డ్యాష్ బోర్డును వినియోగించుకుంటున్న తీరును ప్రత్యక్షంగా చూసిన అమెరికా వ్యాపార వర్గాలు ప్రశంసలు కురిపించాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







