సబ్సిడీ ఎత్తివేతతో కుదేలైన మీట్ మార్కెట్
- October 05, 2015
మార్కెట్‌లో మీట్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మీట్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో మార్కెట్‌లో అమాంతం మీట్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క బహ్రెయినీ దినార్‌కే కిలో మీట్ ఐదు రోజుల క్రితం లభిస్తే, దాని ధర ఇప్పుడు 3.2 బహ్రెయినీ దినార్‌లకు చేరుకుందనీ, దాంతో వినియోగదారులు మీట్‌ని కొనడానికి రావడంలేదని వ్యాపారులు చెప్పారు. 50 రోజులుగా మీట్ వ్యాపారం చేస్తున్న అబు జాబర్, ప్రతిజూ 15 నుంచి 20 గొర్రెలను కొనుగోలు చేసేవాడిననీ, ఇప్పుడు 2 నుంచి మూడు గొర్రెల్ని మాత్రమే తీసుకొచ్చాననీ, వాటి మాంసం కూడా మిగిలిపోతోందని చెప్పాడు. చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆవు మాంసం ధర కూడా అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. వ్యాపారుల ఈ సంక్షోభం నుంచి బయటపడెదెలా? అని ఆవేదన చెందుతున్నారు. పాలకులు కల్పించుకుని, సమస్యకు పరిష్కారం వెతకాలని వ్యాపారులు కోరుతున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







