రాజస్ధాన్‌లోని పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి
- May 10, 2017
రాజస్ధాన్‌లోని భరత్‌పూర్‌లో గురువారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన పందిట్లో మృత్యువు విలయతాడవం సృష్టించింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులు భారీ వర్షం కురవడంతో దగ్గరలోని ఓ గోడ పక్కనే నిల్చున్నారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది నలిగి ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్ర గాయాలయపాలయ్యారు.
ఘటనపై మాట్లాడిన పోలీసులు మృతుల్లో 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలిన గోడ దాదాపు 90 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. గోడకు అనుకుని ఏర్పాటు చేసిన కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఘోర ప్రమాదంపై రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







