ధనుష్, అమలాపాల్ జంటగా 'వీఐపీ 2' జులై 28న విడుదల
- May 10, 2017
రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ‘వీఐపీ 2’. ‘వేలైయిల్లా పట్టధారి 2’కి ఇది సంక్షిప్తరూపం. 2014లో ధనుష్, అమలాపాల్ ప్రధానపాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ధనుష్ కథ, సంభాషణలు రాయగా ధనుష్‌కు చెందిన ఉండర్‌బార్ ఫిలిమ్స్, కలైపులి ఎస్.థాణుకు చెందిన ‘వి’ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్‌వణ్ణన్ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్ పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని ధనుష్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. జులై 28న చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ధనుష్ దర్శకత్వం వహించిన ‘పవర్ పాండి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ‘వీఐపీ 2’ విడుదలపై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాశ్ జంటగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉండటం ధనుష్ అభిమానులకు రెట్టింపు జోష్‌ను కలిగిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







