ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఉద్వాసన ట్రంప్ సంచలన నిర్ణయం
- May 10, 2017
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమెని పదవి నుంచి తొలగించారు. ట్రంప్ నిర్ణయంపై డెమాక్రాట్లు మండిపడ్డారు. రష్యాతో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావితం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే.. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ ఈ-మెయిల్స్ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్‌కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్టు ట్రంప్ సర్కార్ పేర్కొంది. కోమె నాలుగేండ్ల నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు మరో పదేండ్ల సర్వీస్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను పదవి నుంచి తొలగిస్తున్న విషయాన్ని ట్రంప్ నేరుగా కోమెకు తెలియజేయడం గమనార్హం. ఈమేరకు ఆయన ఓ లేఖను కొమెకు పంపించారు.
దానిలో 'మీరు బ్యూరో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారనే అమెరికా అటార్నీ జనరల్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా' అని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై అటార్ని జనరల్ సీజన్స్ మాట్లాడుతూ 'అత్యున్నత శ్రేణి క్రమశిక్షణ, నిబద్ధత, చట్టానికి కట్టుబడి ఉన్నాం. అందుకే ఒక కొత్త ప్రారంభం అవసరమైంది' అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, లాస్ఏంజిల్స్లోని ఎఫ్‌బీఐ ఏజెంట్లతో సమావేశంలో ఉన్నప్పుడు తనను తొలిగిస్తున్న విషయం కోమెకు తెలిసింది.
ఆయన బృందంలోని ఒక సభ్యుడు కోమెకు ఈ విషయాన్ని చెప్పాడు. 56 ఏండ్ల కోమె ఈ విషయాన్ని జోక్‌గా భావించి సరదాగా తీసుకున్నారు. తర్వాత అది వాస్తవమని అర్థమైంది. ప్రస్తుతం ఎఫ్‌బీఐ డెరెక్టర్ ఖాళీని భర్తీ చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేపట్టిన దర్యాప్తు ట్రంప్‌కు చుట్టుకుంటుందన్న భయంతోనే కోమెను తొలగించినట్టు సెనెట్ నాయకుడు చుక్ స్కీమర్ ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను ట్రంప్ ఇప్పటికే కొట్టివేశారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి









