ధనుష్‌ 'వీఐపీ 2' రిలీజ్ డేట్

- May 11, 2017 , by Maagulf
ధనుష్‌ 'వీఐపీ 2' రిలీజ్ డేట్

ధనుష్‌, అమలాపాల్‌ జంటగా సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీఐపీ 2'..రఘువరన్ బిటెక్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతుంది. 2014లో వచ్చిన ఈ మూవీ తమిళ్ , తెలుగు లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.
ఈ చిత్రానికి ధనుష్‌ కథ, సంభాషణలు రాయగా ధనుష్‌కు చెందిన ఉండర్‌బార్‌ ఫిలిమ్స్‌, కలైపులి ఎస్‌.థాణుకు చెందిన 'వి' క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్‌వణ్ణన్‌ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్‌ వేణి తేరా ఫై కనిపిస్తుంది. జులై 28న చిత్రం విడుదల కాబోతున్నట్లు ధనుష్ తన ట్విట్టర్ లో తెలిపాడు.
తాజాగా ధనుష్‌ దర్శకత్వం వహించిన 'పవర్‌ పాండి' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com