విదేశాల నుంచి బంగారాన్ని చాక్లెట్‌ పెట్టెలో పసిడి రేకులు

- May 11, 2017 , by Maagulf
విదేశాల నుంచి బంగారాన్ని చాక్లెట్‌ పెట్టెలో పసిడి రేకులు

 విదేశాల నుంచి బంగారాన్ని అడ్డదారిలో తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుకుపైఎత్తు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు బంగారాన్ని పలచని రేకుగా మార్చి చాక్లెట్‌ డబ్బాల అంచులో పెట్టి తరలిస్తూ అడ్డంగా దొరికాడు. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి గురువారం అబుదాబి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగాడు. 423 గ్రాముల పసిడిని పలుచని రేకులుగా మార్చి.. వాటిని రెండు చాక్లెట్‌ బాక్సుల్లో.. ఓ ఫేస్‌క్రీమ్‌ బాక్సు లోపలి భాగం అంచులో దాచాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. చాక్లెట్‌ బాక్సులు, ఫేస్‌క్రీమ్‌ బాక్సులో బంగారు రేకులను గుర్తించారు.దాదాపు రూ.12 లక్షల విలువైన బంగారు రేకులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ కోసం నిందితుణ్ని కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com