రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇకపై మీ క్రెడిట్ కార్డులు చెంతన పెట్టుకోవటం మరవకండి!
- May 12, 2017
రైల్లో క్యాటరింగ్ సర్వీస్‌ను నగదు రహితంగా అమలు చేసేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. క్యాష్‌లెస్ విధానం ద్వారా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తినుబండారాలు కొనుగోలు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి సేవా రుసుమును వసూలు చేయడం లేదు. దీని వల్ల ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రీతిలో క్యాష్‌లెస్ పద్దతిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తినుబండారాలను క్రెడిట్ లేదా, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని జూన్ 30 నుంచి అమలు చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







